Kalki: 'జవాన్' రికార్డును బద్దలు కొట్టిన 'కల్కి'

Kalki creates record in Book my Show

  • బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన చిత్రంగా 'కల్కి'
  • ఇప్పటి వరకు 1.25 కోట్ల టికెట్ల బుకింగ్స్
  • రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఏడవ చిత్రంగా రికార్డ్

ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన 'కల్కి' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు గడుస్తున్నా కలెక్షన్లు తగ్గడం లేదు. ఇటీవలే ఈ చిత్రం రూ. 1,000 కోట్ల వసూళ్ల మార్కును దాటింది. రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఏడవ భారతీయ సినిమాగా, ప్రభాస్ రెండో చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పడు వీకెండ్ వస్తుండటంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 

మరోవైపు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన చిత్రంగా నిలిచింది. దాదాపు 1.25 కోట్ల టికెట్లు బుక్ అయిన చిత్రంగా రికార్డులకెక్కింది. తద్వారా షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 'జవాన్' సినిమా 1.20 కోట్ల టికెట్ బుకింగ్స్ తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 1.30 లక్షల 'కల్కి' టికెట్లు బుక్ కావడం గమనార్హం.

Kalki
Prabhas
Book My Show
Tollywood
Bollywood
jawan
Shahrukh Khan
  • Loading...

More Telugu News