Anam Ramanarayana Reddy: శాంతి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం లేదు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy about suspended Shanthi issue

  • శాంతి అక్రమాలపై విచారణ జరుగుతోందని వెల్లడి
  • శాంతి అక్రమాలపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదికలు వచ్చాయని వెల్లడి
  • ఆ నివేదికలను నాటి ప్రభుత్వ పెద్దలు తొక్కి పెట్టారన్న మంత్రి
  • విజయసాయిరెడ్డి రాజకీయాలకు అనర్హుడని వ్యాఖ్య

సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యక్తిగత జీవితంతో తమకు సంబంధంలేదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆమె అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కి పెట్టారని ఆరోపించారు.

శాంతి గతంలో విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసినట్లు తెలిపారు. ఆమె హయాంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించి, విచారణ జరిపారని వెల్లడించారు. ఈ అవకతవకల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. ఆమె తప్పు చేసినట్లుగా నివేదికలు చెప్పినప్పటికీ... ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాటిని తొక్కిపెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆ నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు.

విశాఖలో ఆరేడు దేవస్థానాలలో విచారణ జరిపితే అవకతవకలు ఉన్నట్లుగా వెల్లడైందన్నారు. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నివేదికలు పరిశీలించి ఆమెపై చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదట ఆమెపై ఇన్ని ఆరోపణలు రాలేదన్నారు. మొదట ఆమెను సస్పెండ్ చేశామని, ఆ తర్వాత ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.

తాము ఆలయానికి భూములు ఇస్తే వాటిని అమ్ముకున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. శాంతి పని చేసిన ఆలయాల్లో జరిగిన అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. నివేదిక వచ్చాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

విజయసాయిరెడ్డి రాజకీయాలకు అనర్హుడు

శాంతిని సస్పెండ్ చేస్తూ వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. శాంతి వ్యక్తిగత జీవితంతో... ప్రభుత్వానికి, తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ దేవాదాయశాఖకు సంబంధించి ఆమె చేసిన అవకతవకలకు మాత్రం తమదే బాధ్యత అన్నారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడన్నారు. ఆయన తక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శాంతి చేసిన అవకతవకలపై గత ప్రభుత్వంలోనే నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ఆ నివేదికలను పరిశీలించాకే ఆమెను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పూర్తి వివరాలతో నివేదిక కోరినట్లు చెప్పారు. ఆమె తప్పు చేసినట్లుగా అన్ని నివేదికలు వెల్లడించాయన్నారు. రేపు వచ్చే నివేదికను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఆమెను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. దేవాదాయ శాఖ భూములలో అక్రమాలు జరిగి ఉంటే వెనక్కి తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News