England Record: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. సంచలన రికార్డు సృష్టించిన ఇంగ్లండ్

England reached 50 run mark in less that 27 balls in Test match Against West indies and This is the first time in the 147 years history of Test criket

  • కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగుల స్కోర్ అందుకున్న ఇంగ్లండ్ జట్టు
  • టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగుల స్కోర్ సాధించిన జట్టుగా రికార్డు
  • వెస్డిండీస్‌పై రెండో టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ - ఒలీ పోప్‌

టెస్టు క్రికెట్‌లో బజ్‌బాల్ (దూకుడుగా బ్యాటింగ్) వ్యూహాన్ని అనుసరిస్తున్న ఇంగ్లండ్ జట్టు సంచలన రికార్డు సృష్టించింది. నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కేవలం 4.2 ఓవర్లలో 50 పరుగుల స్కోరును అందుకుంది. పవర్ హిట్టింగ్ జోడీ బెన్ డకెట్ ఒలీ పోప్‌ల దూకుడికి సునాయాసంగా ఈ స్కోరుని చేరుకుంది. కాగా 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 27 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను చేరుకోవడం ఇదే తొలిసారని గణాంకాలు చెబుతున్నాయి. 1994లో ఓవల్‌ మైదానంలో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు చేయగా.. ఇప్పుడు 26 బంతుల్లోనే 50 పరుగులు సాధించి తన రికార్డును తానే బద్దలు కొట్టింది.

టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 50 రన్స్ సాధించిన జట్లు ఇవే..
1. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్(2024)- 4.2 ఓవర్లు
2. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ (1994) - 4.3 ఓవర్లు
3. శ్రీలంకపై ఇంగ్లండ్ (202) - 4.6 ఓవర్లు
4. పాకిస్థాన్‌పై శ్రీలంక(2004) - 5.2 ఓవర్లు - 
5. ఇంగ్లండ్‌పై భారత్ (2008) - 5.3 ఓవర్లు
6. వెస్టిండీస్‌పై భారత్ (2023) - 5.3 ఓవర్లు

కాగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండవ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఇంగ్లండ్‌‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు ఇవే..
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మార్క్ ఉడ్, షోయబ్ బషీర్.
వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథానాజ్, కావెం హాడ్జ్, జాసన్ హోల్డర్, సిల్వా (వికెట్‌ కీపన్), కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్.

  • Loading...

More Telugu News