Kannappa Movie: ‘కన్నప్ప’ మూవీ విడుదలపై అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు

Manchu Vishnu announced that movie Kannappa will release in December 2024


భారీ బడ్జెట్, అంచనాలతో రూపుదిద్దుకుంటున్న 'కన్నప్ప' సినిమా విడుదలపై హీరో మంచు మనోజ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నట్టు ఇవాళ (గురువారం) ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. ‘‘డిసెంబర్ 2024లో కన్నప్ప విడుదలవుతుంది. హర్‌హర్‌మహాదేవ్’’ అని విష్ణు రాసుకొచ్చాడు. కాగా పౌరాణిక-కల్పిత గాథతో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మే నెలలో ప్రతిష్ఠాత్మక ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లో ప్రదర్శించారు. ఆ తర్వాత జూన్ 14న భారత్‌లో రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. 

కాగా కన్నప్ప సినిమాకు ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, ముఖేశ్ రిషి, బ్రహ్మానందం, మధు, ప్రీతి ముఖుందన్‌తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి పాన్ ఇండియా స్టార్లతో పాటు కాజల్ అగర్వాల్‌ కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లేను విష్ణు మంచు రాయగా.. కథను పరుచూరి గోపాల కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి.నాగేశ్వర రెడ్డి, తోట ప్రసాద్ సంయుక్తంగా సమకూర్చారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. కాగా కన్నప్ప సినిమా విడుదల తేదీని వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి.

More Telugu News