Uttar Pradesh: శరీరాకృతిపై ఆఫీసులో వేధింపులు.. బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

UP female Bank employee subjected to body shaming ends life

  • ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘాజియాబాద్ వాసి శివానీ
  • శరీరాకృతి, దుస్తులు, మాటతీరు బాలేదంటూ తోటి ఉద్యోగులు వేధించేవారని సూసైడ్ నోట్
  • లేఖలో ఐదుగురు ఉద్యోగుల ప్రస్తావన, వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్

కార్యాలయంలో తోటి ఉద్యోగుల వేధింపులు తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. తన ఆత్మహత్యకు ఐదుగురు సహోద్యోగులు కారణమంటూ సూసైడ్ లేఖ రాసిన ఆమె వారికి మరణశిక్ష వేయాలని పేర్కొంది. నోయిడాలోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌‌లో పనిచేసే శివానీ త్యాగీ గత శుక్రవారం ఘాజియాబాద్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన శరీరాకృతి, దుస్తులు మాట తీరు తదితరాలపై తోటి ఉద్యోగుల వేధింపులు, టార్చర్ తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని ఘాజియాబాద్ డీసీపీ తాజాగా పేర్కొన్నారు. 

శివానీ కార్యాలయంలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగి తన సోదరిని సూటిపోటి మాటలు, వెక్కిరింతలతో వేధించేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. ఓసారి ఆమె శివానీపై దాడికి దిగితే ఆమె తిరిగి చెంపపగలగొట్టిందని అన్నారు. తాను చాలా సార్లు రిజైన్ చేద్దామని అనుకున్నా, కంపెనీ వారు ఏదో కారణంతో ఆమె ప్రయత్నాన్ని తిప్పికొట్టేవారని చెప్పాడు. చెంప దెబ్బ ఘటన తరువాత శివానీకి టెర్మెనేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆఫీసులో వేధింపులపై శివానీ పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, చర్యలు తీసుకోలేదని ఆమె సోదరుడు ఆరోపించాడు.

  • Loading...

More Telugu News