Chandrababu: ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నేడు గృహప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends house warming ceremony in Delhi
  • నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
  • చంద్రబాబుకు ఢిల్లీలో 1 జన్ పథ్ నివాసం కేటాయింపు
  • నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు. నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, ఇవాళ తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోక్ సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Chandrababu
House Warming
Official Residence
New Delhi
TDP
Andhra Pradesh

More Telugu News