Mallu Bhatti Vikramarka: రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka talks about loan waiver program

  • తెలంగాణలో రేపటి నుంచి రుణ మాఫీ
  • రుణ మాఫీ అమలుకు తాము కట్టుబడి ఉన్నామన్న భట్టి
  • అన్ని కుటుంబాలకు రుణ మాఫీ చేస్తామని స్పష్టీకరణ

తెలంగాణలో రేపటి నుంచి రుణ మాఫీ అమలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో మాట్లాడారు. రుణ మాఫీ కార్యక్రమం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. 

అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డులు లేని ఆరు లక్షల రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు నెల దాటేలోపు రుణమాఫీ పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రుణ మాఫీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లాలని, తలెత్తుకుని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 

గత ప్రభుత్వం రూ.1 లక్ష రుణమాఫీని రూ.25 వేల చొప్పున నాలుగు విడతల్లో పూర్తి చేసిందని... తాము రెండు లక్షల రుణమాఫీని నెల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని భట్టి వివరించారు. ఏడు లక్షల కోట్ల అప్పుతో అధికారం చేపట్టినప్పటికీ, ఇచ్చిన హామీలపై ఎక్కడా వెనక్కి తగ్గడంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News