Revanth Reddy: కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy responds on Jawahar Nagar boy death

  • బాలుడి మృతి తీవ్రంగా కలచివేసిందన్న ముఖ్యమంత్రి
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • వీధికుక్కల దాడిపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచన

హైదరాబాద్‌లోని జనహర్ నగర్‌లో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వీధికుక్కల దాడిపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కుక్కలు దాడి చేస్తే అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Revanth Reddy
Congress
Dog
  • Loading...

More Telugu News