Flim Fare awards - 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2024.. అవార్డుల పోటీలో తెలుగు చిత్రాలు ఇవే!

Telugu Film fare awards nominations

  • మొదలైన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2024 సంరంభం
  • త్వరలో అవార్డ్స్ కోసం పోటీ పడుతున్న వివిధ చిత్రాల జాబితా విడుదల 
  • వేడుకకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి 

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2024 హడావుడి మొదలైంది. త్వరలో జరగబోయే ఈ వేడుకలో అవార్డులను దక్కించుకునేందుకు పలు తెలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇందుకు సంబంధించి 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - 2024కు పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయన్న విషయంపై నామినేషన్స్ ప్రకటించారు. అయితే, వేడుకలను ఎక్కడ నిర్వహిస్తారు? ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రదర్శనలు ఇచ్చే తారలు ఎవరు? అతిథులు ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలు..
ఉత్తమ చిత్రం
బేబీ, బలగం, దసరా, హాయ్ నాన్న, మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి, సామజవరగమన, సలార్: పార్ట్ - 1 సీజ్ ఫైర్
ఉత్తమ దర్శకుడు
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి), కార్తిక్ దండు (విరూపాక్ష), ప్రశాంత్ నీల్ (సలార్: పార్ట్ - 1 సీజ్ ఫైర్), సాయి రాజేశ్ (బేబీ), శైర్యువ్ (హాయ్ నాన్న), శ్రీకాంత్ ఓదెల (దసరా), వేణు యెల్దండ (బలగం) 
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ), బాలకృష్ణ (భగవంత్ కేసరి), చిరంజీవి (వాల్తేర్ వీరయ్య), ధనుష్ (సర్), నాని (దసరా), నాని (హాయ్ నాన్న), నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి
అనుష్క (మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి), కీర్తి సురేశ్ (దసరా), మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న), సమంత (శాకుంతలం), వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ సహాయనటుడు 
బ్రహ్మానందం (రంగ మార్తాండ), దీక్షిత్ శెట్టి (దసరా), కోట జయరాం (బలగం), నరేశ్ (సామాజవరగమన), రవితేజ (వాల్తేర్ వీరయ్య), విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయనటి 
రమ్యకృష్ణ (రంగమార్తాండ), రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్), రూపా లక్ష్మి (బలగం), శ్యామల (విరూపాక్ష), శ్రీలీల (భగవంత్ కేసరి), శియారెడ్డి (సలార్: పార్ట్ - 1 సీజ్ ఫైర్), శ్వేత రెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్
బేబీ (విజయ్ బుల్గానిన్), బలగం (భీమ్స్ సిసిరిలియో), దసరా (సంతోష్ నారాయణ్), హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్), ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్), వాల్తేర్ వీరయ్య (దేవీశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం
అనంత్ శ్రీరామ్ (గాజుబొమ్మ - హాయ్ నాన్న), అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు - బేబీ), కాసర్ల శ్యామ్ (చమ్మీల అంగిలేసి - దసరా), కాసర్ల శ్యామ్ ( ఊరు పల్లెటూరు - బలగం), పి. రఘు (లింగి లింగి లింగ్డి - కోట బొమ్మాళి పి. ఎస్)
ఉత్తమగాయకుడు
అనురాగ్ కుల్‌కర్ణి (సమయ - హాయ్ నాన్న), హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి - టైటిల్ సాంగ్), పీవీఎస్ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా - బేబీ), రామ్ మిర్యాల (పొట్టిపిల్ల - బలగం), సిధ్ శ్రీరామ్ (ఆరాద్య - ఖుషి), శ్రీరామ చంద్ర ( ఓ రెండు ప్రేమ మేఘాలు - బేబీ)
ఉత్తమ గాయని
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య - ఖుషి), చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ - హాయ్ పాప), దీ (చమ్కీల అంగీలేసి - దసరా), మంగ్లీ (ఊరు పల్లెటూరు - బలగం), శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడీ-హాయ్ నాన్న), శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. -సర్)

Flim Fare awards - 2024
Telugu Film Nominations
  • Loading...

More Telugu News