RSS: ఆరెస్సెస్‌ను చూసి నేర్చుకోవాలి: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్ సింగ్ సూచన

We should learn from RSS says Diggy

  • సందేశాన్ని ప్రభావవంతంగా ఎలా అందించాలో ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలన్న దిగ్విజయ్
  • ప్రత్యర్థులు అయినప్పటికీ ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలని సూచన
  • ఆరెస్సెస్ కార్యాచరణ, ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని వ్యాఖ్య

ఆరెస్సెస్‌ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నర్సింగ్ కాలేజీ కుంభకోణం, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జబల్‌పూర్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక సందేశాన్ని ప్రభావవంతంగా ఎలా అందించాలో, సంస్థను ఎలా విస్తరించాలో అరెస్సెస్‌ను చూసి నేర్చుకోవాలన్నారు.

ప్రత్యర్థులు అయినప్పటికీ ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలన్నారు. వారు మైండ్ గేమ్ ఆడతారని, ఎప్పుడూ నిరసనలు చేయరని... ప్రదర్శనలు నిర్వహించరని పేర్కొన్నారు. వారికి ఎప్పుడూ దెబ్బలు తగలవని, జైళ్లకు కూడా వెళ్లరన్నారు. కానీ మనల్ని జైలుకు పంపుతారని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యాచరణ, ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునన్నారు.

RSS
Digvijay Singh
Congress
  • Loading...

More Telugu News