KTR: ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది: కేటీఆర్

KTR blames government over Tshat channels

  • ప్రభుత్వం నిర్లక్ష్యంతో టీశాట్ ఛానళ్లు మూగబోయాయని విమర్శ
  • టీశాట్ ఛానళ్లతో విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేదన్న కేటీఆర్
  • ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అందరూ నష్టపోతున్నారని ఆవేదన

కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో విద్యార్థులు, నిరుద్యోగులకు నష్టం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీశాట్ ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగబోయాయన్నారు. టీశాట్ ఛానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేదని పేర్కొన్నారు.

కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్ఐఎల్‌తో ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జీశాట్ 16 సేవలు నిలిచిపోయాయని మండిపడ్డారు.

అఖిలపక్షానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్

తెలంగాణలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్య‌స‌భ స‌భ్యులు ఆర్ కృష్ణ‌య్య విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల ఉద్యమాలపై నిర్బంధం సరికాదన్నారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయ‌డాన్ని ఆయన ఖండించారు. నీలం వెంక‌టేశ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిరుద్యోగ జేఏసీ స‌మావేశంలో ఆర్ కృష్ణ‌య్య పాల్గొని మాట్లాడారు.

  • Loading...

More Telugu News