Railway Recruitment: రైల్వేలో 2,424 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

Railway Recruitment Cell of Central Railway has released a notification for recruitment to the various posts

  • 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్
  • ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
  • 10వ తరగతి పాసై, ఐటీఐ శిక్షణ పొందిన వారు అర్హులు     

సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’ 10వ తరగతి అర్హతతో మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌పై ( rrccr.com ) ఆన్‌లైన్‌లో ఆగస్టు 15 లోపు దరఖాస్తు సమర్పించాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను (ఐటీఐ అప్రెంటిస్) కూడా సమర్పించాల్సి ఉంటుంది.

వయసు, ఎంపిక ఇలా..
ఇక దరఖాస్తుదారుల వయసు  15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. వయోపరిమితికి జులై 15 కటాఫ్ తేదీగా ఉంది. కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. కాగా మరింత సమాచారం కావాలనుకున్న అభ్యర్థులు సెంట్రల్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News