Shanti: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాంతి, మదన్ మోహన్ వీడియో ఇదిగో!

Shanti and Madan Mohan dance video goes viral

  • తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరో చెప్పాలంటున్న మదన్ మోహన్
  • విజయసాయిరెడ్డిపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వైనం
  • కలిసి ఉన్న రోజుల్లో విశాఖ బీచ్ లో డ్యాన్స్ చేసిన శాంతి, మదన్ మోహన్

తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరో చెప్పాలంటూ మదన్ మోహన్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు. విజయసాయిరెడ్డిపై ఆయన సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ వార్త వైరల్ అయింది. 

అయితే, ఇదంతా కుల మీడియా పనే అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తీర్పు చెప్పేది వాళ్లే, విచారణ జరిపేది వాళ్లే, సాక్షులు కూడా వాళ్లే అంటూ ఓ వర్గం మీడియాపై ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు. 

ఇక, అసలు విషయానికొస్తే... సోషల్ మీడియాలో శాంతి, ఆమె భర్త మదన్ మోహన్ లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందాల ఆడబొమ్మ అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా... శాంతి, మదన్ మోహన్ విశాఖ బీచ్ లో డ్యాన్స్ చేస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు.

More Telugu News