K Kavitha: తీహార్ జైల్లో కవితకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

BRS MLC Kavitha shifted to hospital

  • 100 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉంటున్న కవిత
  • అస్వస్థతకు గురి కావడంతో దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలింపు
  • దీన్ దయాల్ ఆసుపత్రిలో కవితకు చికిత్స

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించి, చికిత్స చేస్తున్నారు. తీహార్ జైల్లో కవిత 100 రోజులకు పైగా ఉంటున్నారు. కవిత అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు.

K Kavitha
BRS
Health
Hospital
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News