Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 52 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 26 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.70 శాతం పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరకు మళ్లీ కొనుగోళ్లు జరగడంతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 80,717కి చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకుని 24,613 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.58గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.70%), భారతి ఎయిర్ టెల్ (2.00%), టెక్ మహీంద్రా (1.13%), ఇన్ఫోసిస్ (1.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.95%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.11%), ఎన్టీపీసీ (-1.35%), రిలయన్స్ (-1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.42%).