Puranapanda Srinivas: పురాణపండ ఒక్కో గ్రంథం ఒక్కో తేజస్సు.. ప్రశంసించిన డబ్ల్యూటీఎఫ్ చీఫ్ డాక్టర్ వీఎల్ ఇందిరాదత్

WTF chief VL Indira Dutt praised Writer Puranapanda Srinivas

  • తెలుగు భాష శిక్షణ తరగతుల కోసం పురాణపండ గ్రంథాలను అందించిన వారాహి చలనచిత్రం 
  • నాలుగు గ్రంథాలను ఆవిష్కరించిన డాక్టర్ ఇందిరాదత్
  • పురాణపండ శ్రీనివాస్‌లో అద్వితీయమైన ప్రతిభ దాగి ఉందని ప్రశంస
  • మరిన్ని గ్రంథాలు అందిస్తామన్న సాయి కొర్రపాటి

పురాణపండ శ్రీనివాస్ ఒక్కో గ్రంథం ఒక్కో తేజస్సులా ఉంటుందని ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, కె.శ్రీలక్ష్మీమోహన్‌రావు ప్రశంసించారు. ఆయనలో అద్వితీయ ప్రతిభ దాగి ఉందని  కొనియాడారు. తమ సంస్థ నిర్వహించిన తెలుగు భాష శిక్షణ తరగతుల విద్యార్థుల కోసం  పురాణపండ గ్రంథాలను అందజేసిన సినీ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటికి, రచయిత పురాణపండకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. 

చెన్నైలోని త్యాగరాయనగర్ డబ్ల్యూటీఎఫ్ కార్యాలయంలో తెలుగు భాష శిక్షణ తరగతుల కార్యక్రమంలో ‘ఉగ్రం.. వీరం’, ‘శ్రీమాలిక’, ‘స్మరామి.. స్మరామి’, ‘శంకర.. శంకర’ వంటి నాలుగు ధార్మిక గ్రంథాలను చెన్నై తెలుగు సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక ప్రపంచం కోసం ఇందిరాదత్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని డబ్ల్యూటీఎఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఏవీ శివకుమారికి అందించారు. 

ఈ సందర్భంగా  ఇందిరాదత్ మాట్లాడుతూ కష్ట కాలాన్ని తరిమి ఉరిమే ఎన్నో దివ్య ప్రభల మంత్రశక్తులు ఈ మంగళ గ్రంథాల నిండా ఉందని పేర్కొన్నారు.  ప్రపంచ తెలుగు మహాసమాఖ్య త్వరలో నిర్వహించే అపురూప కార్యక్రమాలకు మరిన్ని ఉత్తమ గ్రంథాలను అందిస్తామని వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి చెప్పారు.

  • Loading...

More Telugu News