Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు... అమిత్ షాతో భేటీ

Chandrababu to go Delhi today

  • 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి చంద్రబాబు
  • సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న ఏపీ సీఎం
  • అమిత్ షాతో భేటీలో విభజన సమస్యలపై చర్చించే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. 

ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈరోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశముంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని తెలుస్తోంది.

Chandrababu
Andhra Pradesh
Amit Shah
New Delhi
  • Loading...

More Telugu News