Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్

JSW Group CMD Sajjan Jindal met AP CM Chandrababu

  • చంద్రబాబుతో సమావేశం అద్భుతంగా జరిగిందన్న సజ్జన్ జిందాల్
  • ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ చంద్రబాబు రిప్లై

ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ ఉదయం చంద్రబాబుతో అద్భుతమైన సమావేశం జరిగిందని సజ్జన్ జిందాల్ వెల్లడించారు.

ఏపీ శక్తిసామర్థ్యాలను లోకానికి చూపించేందుకు, ఏపీ ప్రజలకు అవకాశాలు సృష్టించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీ ఒక డైనమిక్ రాష్ట్రం అని, కలిసి పనిచేసేందుకు, రాష్ట్ర పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని సజ్జన్ జిందాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు."మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషదాయకం సజ్జన్ జిందాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఏపీ ప్రజలకు సరికొత్త అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడానికి మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 

Chandrababu
Sajjan Jindal
JSW Group
Andhra Pradesh
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News