Mahipal Reddy: బీఆర్‌ఎస్‌కు భారీ షాక్... కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి వినోద్ కుమార్

Two key leaders joined congress

  • సీఎంను కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
  • జహీరాబాద్ నుంచి పోటీ చేసిన గాలి వినోద్ కుమార్ 
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి

బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మరో ఎమ్మెల్యే, ఒక ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాలి వినోద్ కుమార్‌లు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వారు అధికార పార్టీలో చేరారు. సీఎం వారికి పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌పై గూడెం మహిపాల్ రెడ్డి 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే, గత లోక్ సభ ఎన్నికల్లో గాలి వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై 46 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Mahipal Reddy
Gali Vinod Kumar
BRS
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News