Emergency Landing: ఓ ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ... ఢిల్లీ-న్యూయార్క్ విమానం లండన్ కు మళ్లింపు

Delhi to New York plane diverted to London due to medical emergency

  • ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానం
  • మార్గమధ్యంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు
  • లండన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సాయం అందాల్సి ఉండడంతో... ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానాన్ని లండన్ కు మళ్లించారు. ఈ విమానాన్ని లండన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం (ఫ్లయిట్ నెం.293) ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయల్దేరింది. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆ విమానాన్ని లండన్ లో అత్యవసరంగా దించాలని నిర్ణయించారు. లండన్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ల్యాండైన విమానం... తిరిగి 9.30 గంటలకు న్యూయార్క్ బయల్దేరింది.

  • Loading...

More Telugu News