Sonakshi Sinha: జీ 5లో హారర్ కామెడీ థ్రిల్లర్ గా 'కాకుదా' .. కథ ఇదే!

Kakuda Movie Update

  • సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రగా 'కాకుదా'
  • హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా
  • రాజస్థాన్ నేపథ్యంలో నడిచే కథ
  • కీలకమైన పాత్రలో రితేశ్ దేశ్ ముఖ్

ఓటీటీ తెరపై థ్రిల్లర్ జోనర్లోని కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందువలన సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీ బాటపడుతున్నాయి. ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు పోటీ పడుతున్నాయి. మేకర్స్ కూడా అలాంటి కాన్సెప్ట్ లపైనే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమానే 'కాకుదా'.

 ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సోనాక్షి సిన్హా .. రితీష్ దేశ్ ముఖ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ సినిమా జీ 5లో అందుబాటులో ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.  'కాకుదా' అనేది విలేజ్ నేపథ్యంలో సాగే ఒక దెయ్యం కథ. దెయ్యం చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది. 

'రథోడి' అనే ఒక గ్రామానికి ప్రతి మంగళవారం ఒక నిర్ణీత సమయానికి దెయ్యం వస్తూ ఉంటుంది. దెయ్యంవచ్చే సమయానికి అంతా తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయానికి అలా చేయకపోతే ఆ ఇంటి నుంచి ఒకరు చనిపోతుంటారు. అందువలన గ్రామస్తులంతా ఆ సమయానికి అక్కడికి చేరుకుంటారు. దెయ్యాలు పట్టుకునే వ్యక్తిగా ఆ గ్రామానికి హీరో వస్తాడు. దెయ్యం కారణంగా తన భర్తను పోగొట్టుకున్న ఓ యువతి' అతనితో చేతులు కలుపుతుంది. ఫలితంగా వాళ్లకి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ. 

More Telugu News