KCR: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

CJI adjourned KCR petition

  • విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాలపై నరసింహారెడ్డి కమిషన్‌ను వేసిన ప్రభుత్వం
  • కమిషన్ ఏర్పాటు, తనకు నోటీసులు రావడంపై కేసీఆర్ న్యాయపోరాటం
  • విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు ఉదయానికి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది. విచారణ రావాలంటూ కమిషన్... కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు. తనకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడంపై ఆయన కోర్టుకెక్కారు.

చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News