Diwakar Babu: అందుకే అవకాశాలు రావడం లేదు: రచయిత దివాకర్ బాబు

Diwakar Babu Interview

  • తాజా పరిస్థితుల పట్ల స్పందించిన దివాకర్ బాబు  
  • తనకి ఛాన్సులు రాకపోవడం పట్ల అసంతృప్తి 
  • అందుకు కారణం చెప్పిన దివాకర్ బాబు


దివాకర్ బాబు .. రచయితగా ఆయనకి మంచి పేరు ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసినవారాయన. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, తాజాగా  ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"రచయితగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తయింది. సినిమా రచయితగా మాత్రం 35 ఏళ్లు గడిచాయి. నేను అంత త్వరగా ఎవరిలోనూ కలవలేను. నాకు రావలసినంత పేరు రాకపోవడానికి కారణం ఇదేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో మీడియా ఈ స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణమేమో. పైగా నేను ఎక్కడ పనిచేస్తే అక్కడే ఇమిడిపోతాను. బయట పరిచయాలు .. పరిస్థితులు పట్టించుకోను" అని అన్నారు. 

'నేను రాయడం లేదని అనుకుంటున్నారో .. రాయలేనని అనుకుంటున్నారో తెలియదుగానీ, రాయమని నన్ను ఎవరూ అడగడం లేదు. కొంతమంది ఎందుకు నా దగ్గరికి రావడం లేదో కూడా నాకు తెలుసు. కొత్త దర్శకులు వాళ్లే కథ రాసుకుని .. హీరోను ఒప్పించి సినిమా చేసుకుంటున్నారు. అలాంటివారికి వాళ్లు చెప్పింది విని రాసేవాడు కావాలి .. తీసేవాడు కావాలి .. మ్యూజిక్ చేసేవాడు కావాలి. అతను తప్పు చేస్తే అది తప్పు అని చెప్పేవారు ఉండకూడదు. ఇక కొంతమంది దర్శకులు వారే రాసుకుంటారు. అందువల్లనే నాకు ఛాన్సులు రావడం లేదని అనుకుంటున్నాను" అని చెప్పారు.

More Telugu News