Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to Omar Abdullah wife

  • విడాకులు ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒమర్ పిటిషన్
  • నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఒమర్ భార్యకు నోటీసులు
  • ఒమర్ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన భార్యతో విడాకులు కోరుతూ సుప్రీంకోర్టులో ఒమర్ అబ్దుల్లా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అసనుద్దీన్ లతో కూడిన ధర్మాసనం పాయల్ కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. 

పాయల్ తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని... ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలని 2016లో ఫ్యామిలీ కోర్టులో ఒమర్ పిటిషన్ వేశారు. అయితే, ఆయన విన్నపాన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని 2023లో సమర్థించింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒమర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ... వీరిద్దరూ 15 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని... వారి దాంపత్య బంధం దాదాపు ముగిసినట్టేనని చెప్పారు. వీరికి విడాకులు మంజూరు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News