Team India: శాంసన్ ఫిఫ్టీ, ఆఖర్లో దూబే మెరుపులు... టీమిండియా 20 ఓవర్లలో 167/6

Team India posts 167 runs for 6 wickets in 20 overs

  • టీమిండియా-జింబాబ్వే మధ్య ఐదో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించిన జింబాబ్వే
  • టీమిండియాలో విఫలమైన టాప్-3 బ్యాట్స్ మెన్

జింబాబ్వే జట్టుతో చివరి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ అర్ధసెంచరీతో అలరించాడు. శాంసన్ 45 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్ లతో 58 పరుగులు చేశాడు. శాంసన్ కొట్టిన ఓ సిక్స్ 110 మీటర్ల దూరం వెళ్లింది. 

ఆఖర్లో శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో టీమిండియా స్కోరు 150 మార్కు దాటింది. దూబే 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 26 పరుగులు చేశాడు. 

రియాన్ పరాగ్ 22, యశస్వి జైస్వాల్ 12, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 2, కెప్టెన్ సికిందర్ రజా 1, ఎంగరావా 1, బ్రాండన్ మవుటా 1 వికెట్ తీశారు.

More Telugu News