Devineni Uma: జగన్ ఐదేళ్ల పాలనపై దేవినేని సంచలన ఆరోపణలు

TDP Leader Devineni Uma Sensational Allegations On YS Jagan
  • పకృతి సంపదను అడ్డగోలుగా దోచేశారని మండిపడ్డ ఉమ
  • ఓబులాపురం గనుల్లో సీజ్ చేసిన ఖనిజం కొల్లగొట్టారని ఫైర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని పకృతి వనరులను అడ్డగోలుగా దోచుకున్నారని జగన్ పై మండిపడ్డారు. కేంద్ర సంస్థలు సీజ్ చేసినా లెక్కచేయకుండా ఓబులాపురం గనులలోని ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. లక్ష టన్నుల ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కు అమ్ముకున్నారని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విచారణను అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల అవసరాలను, సమస్యలను గాలికి వదిలేసి.. దోచుకో దాచుకో అంటూ తాడేపల్లి ఖజానా నింపుకున్నారని విమర్శలు గుప్పించారు.
Devineni Uma
YS Jagan
Andhra Pradesh
TDP
Obulapuram

More Telugu News