Team India: శ్రీలంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ లో మార్పు

BCCI changes Team India schedule in Sri Lanka tour

  • ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా
  • అనంతరం శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా
  • టీ20, వన్డే సిరీస్ తేదీలు మార్చిన బీసీసీఐ

ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా... ఆ పర్యటన ముగియగానే శ్రీలంకతో ఆడనుంది. అయితే, శ్రీలంక పర్యటనకు సంబంధించి టీమిండియా షెడ్యూల్ లో మార్పు చేశారు. 

మొదట జులై 26 నుంచి సిరీస్ జరుగుతుందని పేర్కొన్నారు. జులై 26, 27, 29 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగుతాయని... ఆగస్టు 1, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. అయితే, ఇప్పుడా షెడ్యూల్ ను సవరించారు. 

జులై 27 నుంచి పర్యటన ప్రారంభం కానుందని బీసీసీఐ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్ లు... ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూల్ ను విడుదల చేసింది. 

కాగా, టీ20 మ్యాచ్ లన్నీ పల్లెకెలేలో... వన్డే మ్యాచ్ లన్నీ కొలంబోలో నిర్వహించనున్నారు. త్వరలోనే శ్రీలంక పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేయనున్నారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ లోనే బాధ్యతలు స్వీకరించనున్నాడు.

More Telugu News