India: 13 ఉపఎన్నికల్లో 10 చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే గెలుపు

INDIA bloc wins 8 seats NDA 2

  • బీహార్‌లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి విజయం
  • తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు
  • మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం

దేశవ్యాప్తంగా జరిగిన 13 ఉప ఎన్నికల్లో 10 చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల బీజేపీ, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉపఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి, మూడు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్కో స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి. 

హిమాచల్ ప్రదేశ్‌లో డెహ్రా, నలాగఢ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని అమరవారా నుంచి బీజేపీ అభ్యర్థి కమలేశ్ ప్రతాప్ షా విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులోని విక్రవాండిలో డీఎంకే, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లౌర్‌లలో కాంగ్రెస్ గెలుపొందింది. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గండ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలాలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. బీహార్‌లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

  • Loading...

More Telugu News