Mehbooba Mufti: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం!

Mehbooba Mufti claims house arrest on Martyrs Day

  • 'మజార్ ఏ షుహదా'ని సందర్శించకుండా నిర్బంధించారని ఆరోపణ
  • కశ్మీర్ ప్రజల స్ఫూర్తిని అణచివేయలేరనడానికి త్యాగాలే నిదర్శనమని వ్యాఖ్య
  • తన గేటుకు తాళం వేసిన ఫొటోను షేర్ చేసిన ముఫ్తీ

తనను గృహ నిర్బంధం చేసినట్లు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కశ్మీర్ అమరుల దినోత్సవం సందర్భంగా 'మజార్ ఏ షుహదా'ని సందర్శించకుండా అడ్డుకోవడంలో భాగంగా తనను నిర్బంధించినట్లు ఆరోపించారు.

'మజార్ ఏ షుహదా'ను సందర్శించకుండా ఉండేందుకు తనను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. కశ్మీర్ ప్రజల స్ఫూర్తిని అణచివేయలేరనడానికి అమరుల త్యాగాలే నిదర్శనమన్నారు. అమరులకు నివాళులు అర్పించడాన్ని నేరంగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల మన హక్కులు, గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మరింత పోరాటం చేయాలనే సంకల్పం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తన గేట్‌కు తాళం వేసిన ఫొటోలను షేర్ చేశారు.

మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమరవీరులకు నివాళులు అర్పించేందుకు వీలు లేకుండా అడ్డుకుంటున్నారని ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1931లో అప్పటి కశ్మీర్ మహారాజుకు వ్యతిరేకంగా పోరాడిన 22 మంది నిరసనకారులు... సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలకు గుర్తుగా కశ్మీర్‌లో 'మజార్ ఏ షుహదా'ను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News