Nara Lokesh: ముంబయిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో నారా లోకేశ్, బ్రాహ్మణి సమావేశం

Nara Lokesh met UK former prime minister Tony Blair

  • ముంబయిలో అనంత్ అంబానీ వివాహ వేడుక
  • సతీసమేతంగా ముంబయి విచ్చేసిన నారా లోకేశ్
  • బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో పలు అంశాలపై చర్చ

అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా ముంబయి విచ్చేశారు. ఇదే పెళ్లి వేడుకకు వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కలిశారు. 

పరిపాలన, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ఆదాయ సృష్టిపై అవకాశాల గురించి మాట్లాడుకున్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ.... టోనీ బ్లెయిర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఉమ్మడి అజెండాతో ముందుకు వెళతామని తెలిపారు. ఆదాయం పెంచే మార్గాలపై బ్లెయిర్ సూచనలను అధ్యయనం చేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎంతో విలువైన సూచనలు చేసిన టోనీ బ్లెయిర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు.

Nara Lokesh
Tony Blair
Mumbai
Anant Ambani
Wedding
UK
  • Loading...

More Telugu News