Susila: అందుకే మా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వెళ్లడానికి ఎవరూ ఆసక్తిని చూపలేదు: కాంతారావు కూతురు సుశీల

Susila Rao Interview

  • జానపద కథానాయకుడిగా మెప్పించిన కాంతారావు
  • సొంత సినిమాలతో వచ్చిన నష్టం 
  • ఆయన చాలా మొండిమనిషన్న కూతురు
  • ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన

కాంతారావు .. తెలుగు తెరపై తిరుగులేని జానపద కథానాయకుడు. ఒక  వైపున పౌరాణికాలతో ఎన్టీఆర్ .. మరో వైపున రొమాంటిక్ హీరోగా అక్కినేని దూసుకుపోతున్న సమయంలో, జానపదాలను పరిగెత్తించిన రాకుమారుడు. అలాంటి కాంతారావు .. చివరి రోజులలో ఆర్థికపరమైన సమస్యలతో పోరాడారు. ఆయన గురించిన అనేక విషయాలను కూతురు సుశీల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 

"1964లోనే మద్రాసులో నాన్న పెద్ద బంగ్లా కొన్నారు. 3 కార్లు .. 8 మంది నౌకర్లు ఉండేవారు. మాకు ఎలాంటి కష్టం తెలియకుండా ఆయన పెంచారు. అలాంటి ఆయన సొంతంగా తీసిన 5 సినిమాల కారణంగా ఆస్తిపాస్తులను పోగొట్టుకోవలసి వచ్చింది. ఆయన చాలా మొండిమనిషి .. ఎవరు చెప్పినా వినిపించుకునేవారుకాదు.  తాను ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్టు నాన్న ఎవరికీ చెప్పుకోలేదు. తెలిసినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు" అన్నారు. 

"నాన్నకి జాగ్రత్తపడటం తెలియదు. పక్కనే ఉంటూ ఆయనని గైడ్ చేసేవారు కూడా లేరు. అందువలన తనకి తోచింది చేస్తూ వెళ్లారు. ఆయనకి ఇల్లు కూడా లేకుండా కష్టపడుతున్నాడనీ, చిన్నచిన్న వేషాలు వేస్తున్నారని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. మేమున్నాము అని నాన్నకి సాయం చేసేంత మంచి మనసు హీరోలకు ఉందని నేను అనుకోవడం లేదు. హీరోలు మాత్రమే కాదు ఏ ఆర్టిస్టు కూడా రాలేదు. నాన్న పోయిన తరువాత అంతా కనిపించకుండా పోయినవారే. అందుకే మా ఫ్యామిలీ వైపు నుంచి ఎవరూ ఇండస్ట్రీకి వెళ్లడానికి ఆసక్తిని చూపలేదు" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News