Kalki 2898 AD: రూ.1000 కోట్ల మైలురాయి దాటిన 'కల్కి 2898 ఏడీ'

Kalki 2898 AD crosses Rs 1000 cr

  • ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక ప్రధాన పాత్రల్లో కల్కి 2898 ఏడీ
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్
  • జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం

సరికొత్త లోకాలను సృష్టించి, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేలా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2989 ఏడీ చిత్రం బాక్సాఫీసును కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అధిగమించింది. జూన్ 27న రిలీజైన కల్కి తిరుగులేని విజయం సాధించింది. 

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం... విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా, తమ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించడంపై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. కల్కి 2898 ఏడీ చిత్రం రూ.1000 కోట్లు దాటి, ఇంకా వెళుతూనే ఉందని వెల్లడించింది. 

"ఈ మైలురాయి మీ ప్రేమకు నిదర్శనం. ఈ చిత్రం కోసం మేం హృదయపూర్వకంగా పనిచేశాం... మీరు అంతే హృదయపూర్వకంగా మా చిత్రాన్ని ఆదరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం" అంటూ వైజయంతీ మూవీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Kalki 2898 AD
Rs.1000 Cr
Collections
Prabhas
Nag Ashwin
Vyjayanthi Movies
  • Loading...

More Telugu News