: ప్రతి పది మంది భారతీయుల్లో ఇద్దరు కిడ్నీ వ్యాధి పీడితులే
దేశంలో మధుమేహం, బీపీ, కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రతీ 100 మందిలో 17 మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని 13 ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరించి పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. పేషెంట్లలలో అత్యధికులు అంతకుముందెన్నడూ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోలేదట. తమ వద్దకు వచ్చే పేషెంట్లలో 64.5శాతం మంది తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించామని, అదే సమయంలో వారిలో అధిక బీపీ కూడా ఉందని న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వైద్యులు, ఈ అధ్యయనం నిర్వహించిన డాక్టర్ శ్యామ్ సుందర్ చెప్పారు. ఇక 31.6శాతం మంది మధుమేహంతో, 4.7శాతం మంది అనీమియాతో బాధపడుతున్నారని తెలిపారు.