Arikepudi Gandhi: బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న అరికెపూడి గాంధీ

Arikepudi Gandhi joined Congress

  • బీఆర్ఎస్‌కు వరుస షాకులు
  • అధినేత బుజ్జగిస్తున్నా ఆగని వలసలు
  • ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు
  • కండువా కప్పి గాంధీని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌

పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలస ప్రవాహం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 

ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా, తాజాగా ఈ రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది.

Arikepudi Gandhi
BRS
Congress
Revanth Reddy

More Telugu News