Mukesh Kumar Meena: ముకేశ్ కుమార్ మీనాకు కీలక బాధ్యతల అప్పగింత

Mukesh Kumar Meena Appointed As Excise Department CEO

  • ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియామకం
  • గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతల అప్పగింత
  • ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ నియామకం

ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్‌ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముకేశ్ కుమార్ మీనా అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారన్న ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన స్థానంలో కొత్త సీఈవోగా నియమితులైన వివేక్ యాదవ్ మొన్నటి వరకు సీఆర్డీయే కమిషనర్‌గా పనిచేశారు. రెండు రోజుల క్రితం యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అంతలోనే ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News