Kamal Haasan: అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? : పబ్లిక్ టాక్

Bharateeyudu 2 Movie Update

  • గతంలో వచ్చిన 'భారతీయుడు' ఓ సంచలనం 
  • సీక్వెల్ గా రూపొందిన 'భారతీయుడు 2'
  • నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా
  • కథాకథనాల పట్ల ప్రేక్షకుల అసంతృప్తి

శంకర్ .. సౌత్ సినిమా నిర్మాణంలో ఒక కీలకమైన మలుపును .. మార్పును తీసుకొచ్చిన దర్శకుడు. ఆయన ఎంచుకునే చాలా కథలు దేశభక్తి నేపథ్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. అలా చాలా కాలం క్రితం ఆయన నుంచి వచ్చిన సినిమానే 'భారతీయుడు'. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఆ  సినిమాలో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా, ఆయన భార్య పాత్రలో సుకన్య .. కూతురి పాత్రలో కస్తూరి నటించారు. ఇక మనీషా కొయిరాలా .. ఊర్మిళ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

విడుదలైన ప్రతి ప్రాంతంలో ఆ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాకి కమల్ మాత్రమే కాదు, ఏఆర్ రెహ్మాన్ కూడా ఒక హీరోనే అని చెప్పుకున్నారు. అంతగా ఆ పాటలు పాప్యులర్ అయ్యాయి. 'అవినీతికి అలవాటు పడితే కన్నకొడుకునైనా కలుపు మొక్కలా పీకేయవలసిందే' అనే భారతీయుడి కాన్సెప్ట్ చివరివరకూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ ను హ్యాండిల్ చేసిన తీరు విషయంలో శంకర్ ను అభినందించనివారు లేరు. కానీ రీసెంటుగా 'భారతీయుడు 2' కోసం థియేటర్లకు వెళ్లినవారు  మాత్రం ఇది శంకర్ సినిమానేనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

కథా పరంగా చూసుకుంటే, భారతీయుడేమిటి? విదేశాలలో తలదాచుకోవడమేమిటి? అంటున్నారు. భారతీయుడి కాన్సెప్ట్ వలన నష్టపోయినవారెవరైనా ఉంటే, వాళ్ల కుటుంబాల వరకూ ఆయన పట్ల నిరసన తెలియజేయవచ్చు. కానీ దేశ ప్రజలంతా ఈ విషయంలో ఒకే తాటిపైకి రావడం ఏమిటనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయుడు 'మర్మకళ' అనే ప్రాచీన యుద్ధవిద్యను ఉపయోగిస్తూ రౌడీ గ్యాంగ్ పై విరుచుకుపడితే, ఆ మర్మకళ ప్రభావమంటూ, వాళ్లంతా గుర్రంలా గెంతుతూ వెళ్లడం హాస్యాస్పందంగా ఉందని అంటున్నారు. అసలు ఇది శంకర్ సినిమానేనా? అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

  • Loading...

More Telugu News