Pulasa Chepa: పులసల సందడి షురూ.. రూ. 24 వేలు పలికిన కేజీన్నర చేప!

Pulasa Chepa That Cost Rs 24 Thousand For One and Half KG
  • గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి
  • ఎర్రనీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు
  • కోనసీమ జాలరికి చిక్కిన పులస
  • రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
వానాకాలం వచ్చిందంటే చాలు, గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఇక పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది. 

తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేపా.. మజాకా!
Pulasa Chepa
Pulasa Fish
Godavari Districts
Andhra Pradesh
Dr BR Ambedkar Konaseema District

More Telugu News