Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

RajendraNagar MLA joins congress

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
  • నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరినట్లు ప్రకాశ్ గౌడ్ వెల్లడి
  • రేవంత్ రెడ్డి నివాసంలోనే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని ప్రకాశ్ గౌడ్ వెల్లడించారు.

అంతకుముందు, ప్రకాశ్ గౌడ్ బంజారాహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Prakash Goud
Hyderabad
BRS
Congress

More Telugu News