Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్ళు’ నుంచి 'సందడి సందడి' లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన విష్వక్సేన్

Sandadi Sandadi song form Committee Kurrollu out now

  • నిహారిక కొణిదెల సమర్పణలో 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం
  • యదు వంశీ దర్శకత్వంలో చిత్రం
  • తాజాగా, జాతర నేపథ్యంలో సాంగ్ విడుదల
  • ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్రం నుంచి 'సందడి సందడి' అనే సాంగ్ ను చిత్రబృందం టాలీవుడ్ యువ కథానాయకుడు విష్వక్సేన్ చేతుల మీదుగా విడుదల చేసింది. 

జాతర నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ హుషారైన గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ బాణీలు అందించగా... సింహాచలం మన్నె సాహిత్యం సమకూర్చారు. 

ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక తదితరులు నటించారు.

More Telugu News