Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచన చేసిన కొత్త హెడ్ కోచ్ గంభీర్

Gautam Gambhir suggestion to Team India players

  • మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడాల్సిందేనన్న గౌతమ్ గంభీర్
  • వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలని సూచన
  • మీ గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి ఇది ఒకరు ఆడే ఆట కాదని వ్యాఖ్య

టీమ్ ఇండియాకు ఆడే ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడాల్సిందేనని కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. గాయపడటం ఆటలో భాగమేనని... గాయపడిన వారు విశ్రాంతి తీసుకుని మళ్లీ జట్టులోకి వస్తారని... అప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందేనని చెప్పారు. మీరు దేశం కోసం ఆడాలనుకుంటే... వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలని సూచించారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఒక అడుగు ముందుకేసి అన్ని ఫార్మాట్లలో ఆడాలని చెప్పారు. కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి ఇది ఒకరు ఆడే ఆట కాదని అన్నారు. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెటర్లను చూసి నేర్చుకోవాలని సూచించారు.

More Telugu News