Peddireddi Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. ప్రధాన అనుచరుడితో పాటు పలువురు వైసీపీకి రాజీనామా

Peddireddi Ramachadra Reddy followers resigns to YSRCP

  • పులిచెర్ల ఎంపీటీసీ మురళీధర్ రాజీనామా
  • ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచుల రాజీనామా
  • వైసీపీ ఓటమితో మారిపోతున్న పరిస్థితులు

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి, వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూడడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రేంజ్ లో అధికారాన్ని చెలాయించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు.

 అయితే, పరిస్థితి తారుమారయింది. తన నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టేందుకు కూడా పెద్దిరెడ్డి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్ వైసీపీకి, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పులిచెర్ల వైసీపీ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్, మరో నలుగురు ఎంపీటీసీలు, ఏడుగురు సర్పంచులు రాజీనామా చేశారు.

Peddireddi Ramachandra Reddy
Followers
Resign
  • Loading...

More Telugu News