Kishan Reddy: కేసీఆర్ పై సుదీర్ఘ పోరాటం చేశాం: కిషన్ రెడ్డి

Kishan Reddy comments on KCR

  • కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్న కిషన్ రెడ్డి
  • రేవంత్ సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరిందని వ్యాఖ్య
  • రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్న కిషన్ రెడ్డి

అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరిందని చెప్పారు. గతంలో రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో కూడా బీజేపీ సత్తా చాటిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 14 శాతం నుంచి 35 శాతానికి పెరిగిందని తెలిపారు. 

బీజేపీకి ఓట్లు వేసి సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామని చెప్పారు. పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రజల ఆగ్రహానికి గురైందని, ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు.

Kishan Reddy
BJP
Revanth Reddy
Congress
KCR
BRS
  • Loading...

More Telugu News