India Population: 2060వ దశకం తొలినాళ్లలో భారత జనాభా 170 కోట్లకు చేరిక: ఐరాస అంచనా

India population is projected to peak in the early 2060s at about 170 crores says UNO Report

  • గరిష్ఠ స్థాయికి చేరుకున్నాక క్రమంగా తగ్గుతుందన్న ‘వరల్డ్ పాప్యులేషన్ ప్రాస్పెక్ట్స్-2024’ నివేదిక
  • ఈ దశాబ్దమంతా అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతుందని విశ్లేషణ
  • 2080వ దశకంలో ప్రపంచ జనాభా 1300 కోట్లకు చేరుతుందని అంచనా

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల అవకాశాలపై ఐక్యరాజ్యసమితి అంచనా రిపోర్ట్ విడుదల చేసింది. 2060వ దశకం ప్రారంభంలో భారతదేశ జనాభా గరిష్ఠంగా 170 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత 12 శాతం మేర జనాభా తగ్గుదలకు అవకాశం ఉండొచ్చని, అయినప్పటికీ ఈ శతాబ్దంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి లెక్కగట్టింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ పాప్యులేషన్ ప్రాస్పెక్ట్స్-2024’ నివేదికలో పేర్కొంది. కాగా గతేడాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను ఇండియా అధిగమించిన విషయం తెలిసిందే.

ఈ శతాబ్దమంతా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం 2024లో భారతదేశ జనాభా 145 కోట్లుగా ఉందని అంచనా వేసింది.  2054 నాటికి గరిష్ఠంగా 169 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. గరిష్ఠ స్థితికి చేరుకున్నాక 2100 శతాబ్దం చివరి నాటికి 150 బిలియన్లకు పడిపోతుందని అంచనా చేసింది.

ప్రపంచ జనాభా 1300 కోట్లకు పెరుగుదల!
రాబోయే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందని ఐరాస అంచనా వేసింది. 2024లో 820 కోట్లుగా ప్రపంచ జనాభా 2080వ దశకం మధ్యకాలంలో సుమారు 1300 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే జనాభా పెరుగుదల గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత క్రమక్రమంగా క్షీణిత ప్రారంభమవుతుందని, శతాబ్దం చివరి నాటికి 1200 కోట్లకు పడిపోతుందని లెక్కగట్టింది.

  • Loading...

More Telugu News