Drunk Driving: హైదరాబాదులో పెద్ద సంఖ్యలో మందుబాబులకు జైలు శిక్ష

imprisonment for drunk driving

  • 55 మందికి జైలు శిక్ష విధించిన కోర్టు
  • ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష
  • 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దు

మద్యం తాగి వాహనాలను నడుపుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తూ... మందుబాబులకు మత్తు దించుతున్నారు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 

సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 992 కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేసి, కోర్టులో సమర్పించామని... 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని చెప్పారు. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. శిక్ష పడిన వారిలో 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను 2 నుంచి 6 నెలల పాటు రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మిగిలిన వారి నుంచి ఫైన్ల రూపంలో రూ. 21.36 లక్షలు జమ అయిందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News