: వివాహితపై దాడి... సెల్ ఫోన్లో చిత్రీకరణ
ర్యాగింగ్ చట్టం, నిర్భయ చట్టం ఏదీ మృగాళ్ల బారి నుంచి మహిళలను కాపాడటం లేదు. ఎంత సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. మన రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న విజయవాడలో ఓ అమ్మాయిని అసభ్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తే, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలంగిలో ఓ వివాహిత పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు, ఆమెపై దాడి కూడా చేశారు. ఈ సంఘటనను పెద్ద ఘనకార్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించుకున్నారు కూడా. యువకుల దాడిలో గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.