Prakash Goud: బీఆర్ఎస్ కు భారీ షాక్.. ఈరోజు కాంగ్రెస్ లో చేరనున్న ప్రకాశ్ గౌడ్.. రేపు అరికెపూడి గాంధీ

Prakash Goud and Arikepudi Gandhi to join Congress

  • బీఆర్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్
  • ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల చర్చలు సఫలం
  • అసెంబ్లీ సమావేశాలకు ముందే చేరికలు పూర్తయ్యే అవకాశం

గత ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ విలవిల్లాడుతోంది. బీఆర్ఎస్ కింది స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఒక్కొక్కరినీ లాగేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. 

తాజాగా బీఆర్ఎస్ కి మరో భారీ షాక్ తగలబోతోంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 

మరో విషయం ఏమిటంటే... ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల చర్చలు సఫలమయినట్టు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈలోగానే చేరికలను పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

Prakash Goud
Arkepudi Gandhi
BRS
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News