India - China: ఇండియా, చైనా, పాకిస్థాన్ యుద్ధ విమానాల లెక్క తెలుసా?
భారత్‌తో కయ్యానికి కాలుదువ్వేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేశం చైనా. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన యుద్ధాలు మొదలు ఇటీవలి లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉద్రిక్తతల వరకూ.. భారత్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో చైనా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. విస్తరణవాదంతో రెచ్చిపోతూ, వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించి, అక్రమకట్టడాలు నిర్మించి, బలప్రదర్శనకు దిగడం చైనాకు నిత్య కృత్యంగా మారింది.
ఇక చైనాకు సర్వకాల మిత్రదేశమైన పాక్‌కు భారత్‌తో ఆగర్భశత్రుత్వం. భారత్‌ను నేరుగా ఢీకొనలేని దాయాది దేశం ఉగ్రవాదాన్ని, చొరబాట్లను ప్రోత్సహిస్తూ దేశంలో పలు ప్రాంతాల్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీంతో, భారత్‌తో చైనా, పాకిస్థాన్‌లు యుద్ధానికి దిగొచ్చన్న ఆందోళనలు పలుమార్లు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందనేది కొందరి వాదన. ఈ నేపథ్యంలో చైనా, పాక్, భారత్ బలాబలాలపై సహజంగా ఆసక్తి కలుగుతుంది. ఇక ఆధునిక యుద్ధతంత్రంలో వైమానిక శక్తిది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో అసలు మూడు దేశాల వైమానిక శక్తి ఎంతటిదో? ఎవరి వద్ద ఏయే యుద్ధ విమానాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం!