TG Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly budget session from July 24
  • నేడు సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్
  • హాజరైన ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ
  • 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24 నుంచి జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
TG Assembly
Budget Session

More Telugu News