Raj Tarun: రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు... అది ఆయన పర్సనల్: మాల్వీ మల్హోత్రా

Malvi Malhotra on Raj Tharun issue

  • తాను రాజ్ తరుణ్‌తో కలిసి సినిమాలో నటించానన్న మాల్వీ 
  • అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదని వ్యాఖ్య
  • ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఊహించలేదన్న మాల్వీ

నటుడు రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని... అది ఆయన పర్సనల్ విషయమని బాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్రా అన్నారు. 'తిరగబడర సామీ' సినిమాలో తాను రాజ్ తరుణ్‌తో కలిసి నటించానని తెలిపారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదన్నారు.

రాజ్ తరుణ్-లావణ్య అంశంలో మాల్వీ పేరు కూడా బయటకు వచ్చింది. 'తిరగబడర సామీ' సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ అంశంపై స్పందించారు. తమపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి రాజ్ తరుణ్ గతంలో ఎప్పుడూ తనతో మాట్లాడలేదన్నారు.

ఇలాంటి ఆరోపణలు తనపై వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విమర్శలను స్వీకరిస్తామని... కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్ల గురించి అస్సలు పట్టించుకోనన్నారు.

ప్రస్తుతానికి తాను సింగిల్ అని... ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ పైనే ఉందన్నారు. సినిమానే తన ఫస్ట్ లవ్ అని తెలిపారు. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని... అందుకే సినిమా గురించే మాట్లాడాలనుకున్నట్లు చెప్పారు.

Raj Tarun
Tollywood
Malvi Malhotra
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News