Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • 27 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఒకటిన్నర శాతం వరకు నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో నష్టాలు తగ్గుతూ వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 79,897కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 24,315 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.64%), టాటా మోటార్స్ (1.52%), ఏసియన్ పెయింట్స్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.88%), టైటాన్ (0.84%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.24%), ఎన్టీపీసీ (-1.14%), నెస్లే ఇండియా (-1.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.95%).  

  • Loading...

More Telugu News